PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పెళ్లి.. 19 d ago
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. రెండేళ్ల బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నిరీక్షణకు రెండ్రోజుల క్రితమే ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీతో తెరదించిన సింధు, ఈ నెల 22న వివాహం చేసుకోబోతుంది. డిసెంబర్ 22న ఉదయ్పూర్(రాజస్థాన్)లో హైదరాబాద్కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరుగనుంది.